*వైస్సార్ ఉచిత పంటల బీమా కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్* ▪వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఉరవకొండ ఇన్ఛార్జ్ విశ్వేశ్వరరెడ్డి అనంతపురం (ప్రజాఅమరావతి): "వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం" కింద రైతులకు బీమా మొత్తాన్ని అందచేసే కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు.తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లాల వారిగా నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ, ఉరవకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వై. విశ్వేశ్వరరెడ్డి ,ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ & రైతు భరోసా) నిశాంత్ కుమార్, డిసిసిబి చైర్మన్ పామిడి వీరాంజనేయులు,నెరమెట్ల యోగేంద్ర రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. గత టీడీపీ సర్కారు ఎగనామం పెట్టిన పంటల బీమా సొమ్మును రైతులకు చెల్లించేందుకు.. రూ. 596.36 కోట్లు శుక్రవారం సీఎం విడుదల చేశారు. ఈ మొత్తం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమకానుంది. తద్వారా 5,94,005 మంది రైతుల ఖాతాల్లో జమ కానుంది.


Comments