రాజమండ్రి:  ఆవ భూములపై విచారణ జరిపించాలని సీఎం జగన్‌కు లేఖ రాశానని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రూ. 45 లక్షలు పెట్టి కొనుగోలు చేశారని, అంత ధర ఉండదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను రాసిన లేఖను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కాగా అదే ధరకు ఎక్కడ భూములు ఇచ్చినా కొనుగోలు చేయడానికి సిద్దంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ ప్రకటించారన్నారు. అయితే అన్ని నిబంధనల ప్రకారమే జరిగిందని, మూడు శాతం మాత్రమే ఎక్కువ పెంచడం జరిగిందని ఆర్థికశాఖ మంత్రి చెప్పారన్నారు. అవినీతి రహిత పరిపాలన అందిస్తానని చెప్పిన సీఎం జగన్.. ల్యాండ్ విషయంలో జరిగిన అవినీతిని ఎందుకు సమర్ధించారని ఆయన ప్రశ్నించారు. ఇది ప్రభుత్వం అసమర్థత కాదా అని నిలదీశారు. అధిక ద‌ర‌ల‌కు భూములు కొని, ఇళ్ల ప‌ట్టాలు ఇస్తాన‌న‌టం ప్ర‌భుత్వ అస‌మ‌ర్ధ‌త‌కు నిద‌ర్శ‌నం అని అన్నారు. ప్రభుత్వానికి ఇసుక విధానంపై ముందుచూపు లేద‌ని, ఏపీలో నిర్మాణ రంగం కుదేలైపోయింద‌ని ఉండవల్లి ఆరోపించారు. 


Comments