గుంటూరు (ప్రజాఅమరావతి):జూన్,27; నగరం లోని గుజ్జనగుండ్ల సెంటర్ వద్ద ఉన్న డి - మార్ట్ షాపింగ్ మాల్ ను గుంటూరు అర్బన్ ఎస్పీ ఆర్ ఎన్ అమ్మిరెడ్డి, ఐపీఎస్., గారు సందర్శించారు. ఈ సందర్భంగా డీ - మార్ట్ లో Covid - 19 కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న జాగ్రత్తలు / చర్యలు గురించి పరిశీలించారు. ప్రవేశద్వారం వద్ద థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలని, మాస్కులు లేని వారిని లోనికి అనుమతించ రాదని, వ్యక్తిగత దూరాన్ని పాటించేందుకు, శానిటేషన్ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని, సూచనలను గురించి మైక్ ద్వారా తెలియజేస్తూ ఉండాలని యాజమాన్యం వారికి తెలియ పరిచారు. వ్యాపార సంస్థలు తమ తమ వ్యాపారాలను ప్రభుత్వం వారు సూచించిన రోజులలో / సమయాలలో మాత్రమే నిర్వహించాలని Covid - 19 కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకొన వలసిన చర్యలను / జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలని, ఉల్లంఘించిన వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ మరియు సంబంధిత ఇతర చట్టాల మేరకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పట్టాభిపురం సీఐ బత్తుల కళ్యాణ రాజును ఆదేశించారు. అనంతరము నగర ట్రాఫిక్ డిఎస్పి వి.వి.రమణ కుమార్, పశ్చిమ ట్రాఫిక్ సీఐ కె వెంకట రెడ్డి గారితో కలిసి ట్రాఫిక్ రెగ్యులేషన్ గురించి, వాహనదారుల రాకపోకలకు ఎలాంటి అవాంతరాలు జరగకుండా, సక్రమంగా సాగిపోయే విధంగా తీసుకోవలసిన చర్యల గురించి సూచనలు ఇచ్చారు. మాస్కు ధరించని వారిపైన, మోటారు వాహన చట్టాలను ఉల్లంఘించిన వారిపైన చలాన్లు విధించాలని, ద్విచక్రవాహనంపై ఒకరి కంటే ఎక్కువగా మరియు కారు వంటి వాహనంపై డ్రైవర్ కాకుండా ఇద్దరు మించి ప్రయాణించిన వాహనాలు స్వాధీనం చేసుకొని సంబంధిత చట్టాల మేరకు కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.


Comments