. గుంటూరు (ప్రజాఅమరావతి);జాన్ 21; అర్బన్ ఎస్పీ ఆర్ ఎన్ అమ్మిరెడ్డి, ఐపీఎస్., గారు గుంటూరు నగర పరిధిలో విజిబుల్ పోలీసింగ్ ను పరిశీలించారు. ఈ క్రమంలో ట్రాఫిక్ డిఎస్పి వివి రమణ కుమార్, కొత్తపేట సిఐ ఎస్వి రాజశేఖర్ రెడ్డి, వెస్ట్ ట్రాఫిక్ సిఐ కె వాసు, నగరంపాలెం సి.ఐ. బి కోటేశ్వరరావు తదితర అధికారులతో ట్రాఫిక్ రెగ్యులేషన్ గురించి, గుంటూరు నగర పరిధిలో ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యలు / అధిగమించ డానికి తీసుకోవలసిన జాగ్రత్తలు, ఉదయం మరియు సాయంత్రం వేళల్లో విజిబుల్ పోలీసింగ్ నందు పోలీస్ స్టేషన్లలో పనిచేసే సిబ్బంది /అధికారులను వినియో గించుటము, *మాస్కులు లేకుండా బయటకు వచ్చే వారి పైన చర్యలు తీసుకోవడం గురించి, ద్విచక్ర వాహనాల పై ఒకరి కంటే ఎక్కువ వచ్చే సందర్భంలో చేపట్టాల్సిన ఎన్ఫోర్స్మెంట్ వర్క్* మొదలైన వాటిని గురించి పలు సూచనలను అధికారులకు తెలియ జేశారు. అదేవిధంగా కంటోన్మెంట్ ఏరియాలో తీసుకుంటున్న జాగ్రత్తలు పరిశీలించి, అక్కడ విధుల్లో ఉన్న అధికారులకు / సిబ్బందికి బయట నుండి ఎవరు కంటెంట్మెంట్ ఏరియా లోనికి ప్రవేశించకుండా మరియు కంటోన్మెంట్ ఏరియా లోని వారెవరు బయటికి వెళ్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, కరోనా వైరస్ ఉదృతిని దృష్టిలో ఉంచుకొని విధులను ఎలాంటి అలసత్వం లేకుండా నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపైన, సంబంధిత చట్టాల మేరకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం గుంటూరు దిశ మహిళా పోలీస్ స్టేషన్ ను సందర్శించి, అక్కడ రిపోర్టు అవుచున్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మహిళల పై జరిగే అత్యాచారాలు / వేధింపులు మొదలైన కేసుల గురించి పక్కాగా విచారణ చేపట్టి, ఎలాంటి ఆలస్యం లేకుండా దర్యాప్తు పూర్తి చేసి, చార్జిషీట్లు కోర్టులలో దాఖలు చేయాలని, కుటుంబ సంబంధమైన ఫిర్యాదులలో చట్టం నిర్దేశించిన మేరకు కౌన్సిలింగ్స్ నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దిశా మహిళా పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ డిఎస్పి ఎ లక్ష్మీనారాయణ, ఎస్ఐలు ఖాజీ బాబు, కోటయ్య మరియు సిబ్బంది హాజరుగా వున్నారు.


Comments