*పేద పిల్ల‌ల‌కు ఇక కార్పొరేట్ స్థాయి విద్య‌* *నాడు-నేడు ప‌థ‌కంతో చ‌దువుల విప్ల‌వం* *ప‌నుల్లో చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గం ముందంజ‌* *జిల్లాలోనే య‌డ్ల‌పాడు మండ‌లానికి తొలిస్థానం* *నిరంత‌ర ప‌ర్యవేక్ష‌ణ‌తోనే స‌త్ఫ‌లితాలు* *ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గారి స్ఫూర్తితో ముందుకు* *చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని గారు* లింగారావుపాలెం గ్రామంలో నాడు-నేడు ప‌నుల ప‌రిశీల‌న‌* పేద విద్యార్థుల‌కు నాణ్య‌మైన చ‌దువులు అందించ‌డ‌మే నాడు-నేడు ప‌థ‌కం ల‌క్ష్య‌మ‌ని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని గారు తెలిపారు. య‌డ్ల‌పాడు మండ‌లం లింగారావుపాలెం ప్ర‌భుత్వ ఉన్న‌త పాఠ‌శాలలో జ‌రుగుతున్న నాడు-నేడు ప‌నుల‌ను శ‌నివారం ఎమ్మెల్యే గారు ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నాడు-నేడు పనులు పూర్త‌యితే పేద పిల్ల‌ల‌కు కార్పొరేట్ స్థాయి విద్య ద‌క్కుతుంద‌ని తెలిపారు. య‌డ్ల‌పాడు మండ‌లంలో మొత్తం 19 పాఠ‌శాల‌ల‌ను నాడు-నేడు కింద తీర్చిదిద్దేందుకు ఎంపిక‌చేసిన‌ట్లు చెప్పారు. 2.53 కోట్లు ప్ర‌భుత్వం ప‌నుల కోసం కేటాయించింద‌న్నారు. ఈ నిధుల్లో ఇప్ప‌టికే 90.81 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేశార‌ని వెల్ల‌డించారు. నాడు-నేడు ప‌నుల కోసం మొత్తం మీద 35.83 శాతం నిధుల‌ను ఇప్ప‌టికే ఖ‌ర్చు చేసిన తొలి మండ‌లంగా య‌డ్ల‌పాడు నిలిచింద‌ని చెప్పారు. జిల్లాలోనే నాడు నేడు ప‌నుల్లో య‌డ్ల‌పాడు మండ‌లం తొలి స్థానంలో నిలిచింద‌ని వెల్ల‌డించారు. చిల‌క‌లూరిపేట మున్సిపాలిటీ రాష్ట్రంలోనే నాడు-నేడు ప‌నుల్లో ఇప్ప‌టికే తొలి స్థానంలో కొన‌సాగుతున్న విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించాల్సి ఉంద‌న్నారు. అధికారుల కృషి ఫ‌లితంగానే ఇది సాధ్య‌మైంద‌ని తెలిపారు. నిరంత‌రం ప‌ర్య‌వేక్ష‌ణ‌తోనే తమ నియోజ‌క‌వ‌ర్గం నాడు- నేడు ప‌నుల్లో దూసుకుపోతోంద‌న్నారు. ముఖ్య‌‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గారి స్ఫూర్తితో తాము ముందుకు వెళుతున్నామ‌న్నారు. నాడు- నేడు ప‌థ‌కంలో భాగంగా అన్ని పాఠ‌శాల‌ల్లో మౌలిక సదుపాయాల్లో వినూత్న మార్పులు వ‌స్తాయ‌ని చెప్పారు. రాష్ట్రంలో చ‌దువుల విప్ల‌వం వెల్లివిర‌య‌బోతోంద‌ని చెప్పారు. ఎమ్మెల్యే గారి వెంట య‌డ్ల‌పాడు మండ‌లం అభివృద్ధి అధికారి మాధురి గారు, పంచాయ‌తీరాజ్ ఏఈ గోపాల్‌ గారు, పాఠ‌శాల మేనేజిమెంట్ క‌మిటీ చైర్మ‌న్‌, స‌భ్యులు, పాఠ‌శాల ప్రధానోపాధ్యాయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయ‌కులు ఆలోకం వెంకట ల‌క్ష్మీనారాయ‌ణ‌,ఆలోకం శ్రీనివాసరావు, షేక్ మాబు సుభాని,నంబూరి శివరామకృష్ణ,మద్దు శ్రీనివాసరావు, విప్పర్ల రామారావు,షేక్ నాగూర్ ఇత‌ర నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.


Comments