*నేడు రాజ్యసభ ఎన్నికల పోలింగ్-ఎన్నికల నిర్వహణకు అన్నిఏర్పాట్లు పూర్తి* అమరావతి(ప్రజాఅమరావతి),18 జూన్:ఈనెల 19వతేది శుక్రవారం జరిగే రాజ్యసభ(Council of States) ద్వైవార్షిక ఎన్నికలు(Biennial Elections)నిర్వహణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ లోని కమీటీ హాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.పోలింగ్ శుక్రవారం ఉదయం 9గం.ల నుండి సాయంత్రం 4గం.ల వరకూ జరగనుంది.అనంతరం సాయంత్రం 5గం.లకు ఓట్ల లెక్కింపు చేపట్టి ప్రక్రియ పూర్తయిన పిదప ఫలితాలను ప్రకటిస్తారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు సంబంధించి నాలుగు ఖాళీలకు ఎన్నికలు జరగనుండగా ఐదుగురు అభ్యర్ధులు పోటీలు ఉన్నారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి ఆయోధ్య రామిరెడ్డి ఆళ్శ,నట్వాణి పరిమళ్,పిల్లి సుభాష్ చంద్రబోస్,వెంకటరమణారావు మోపిదేవి పోటీలో ఉండగా తెలుగుదేశం పార్టీ నుండి వర్ల రామయ్య పోటీలో ఉన్నారు.రాష్ట్ర అసెంబ్లీలో సభ్యులుగా ఉన్న 175 మంది ఎంఎల్ఏలు రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో ఓటర్లుగా వారు తమ ఓటు హక్కును వినియోగించుకు కోనున్నారు. వాస్తవానికి రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు గత మార్చి 26వతేదీన జరగాల్సి ఉండగా కరోనా వైరస్ కారణంగా భారత ఎన్నికల సంఘం ఈఎన్నికలను వాయిదా వేయగా ఈనెల 19వతేదీన ఈఎన్నికలు జరగనున్నాయి.ఈఎన్నికల నిర్వహణకు సంబంధించి అసెంబ్లీలోని మొదటి అంతస్తులో గల కమిటీ హాల్లో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అవసరమైన ఏర్పాట్లు చేశారు.విస్తృతమైన ఏర్పాట్లు చేశారు.ఈ ఏర్పాట్లను అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణ మాచార్యులు గురువారం పరిశీలించి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అసెంబ్లీ సిబ్బందికి అవసరమైన ఆదేశాలు జారీ చేయడం తోపాటు వారికి గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు.


Comments