ఏపీలో 10,884కు చేరిన కరోనా కేసులు అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో గురువారం కొత్తగా 477 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. బుధవారం ఉదయం 9గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు 19,085 సాంపిల్స్‌ను పరిశీలించగా 477 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ​దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10,884 కు చేరింది. ఇప్పటివరకు ఏపీలో రికార్డుస్థాయిలో 7,69,319 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో ఏపీ నుంచి 8783 కేసులు, 1,730 కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారివి కాగా, 371 కేసులు ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి సంబందించినవి ఉన్నాయి. కరోనా నుంచి ఇవాళ 118 మంది పూర్తిగా కోలుకోగా.. రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 4988గా ఉంది. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఏడుగురు మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 136కు చేరుకుంది. ఏపీలో ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 5,760గా ఉంది.


Comments