పుత్తూరు (ప్రజాఅమరావతి); పురపాలక సంఘ పరిధిలోని మంచినీళ్ల కుంట 1.80 ఎకరాల విస్తీర్ణం గల ప్రదేశంలో మున్సిపల్ పార్క్ ఏర్పాటు చేయుటకు ఎమ్మెల్యే ఆర్కే రోజా గారు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (TUDA) వారికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు మన ఎమ్మెల్యే ఆర్కే రోజా గారి తో పాటు TUDA DE వరద రెడ్డి గారు , AE రవీంద్ర గారు స్థలాన్ని పరిశీలించారు తదనుగుణంగా ప్రతిపాదనలు, ప్రణాళికలు వెంటనే తయారు చేస్తామని చెప్పారు.


Comments