. గుంటూరు (ప్రజాఅమరావతి) అర్బన్ మినీ కాన్ఫరెన్స్ హాల్ నుండి అర్బన్ ఎస్పి ఆర్ఎన్ అమ్మిరెడ్డి, ఐపిఎస్., గారు అదనపు ఎస్పీ డి గంగాధరం, డిఎస్పీలు ఎం బాల సుందరరావు, పి శ్రీనివాసులు గార్లతో మరియు స్థానిక కళాశాలల విద్యార్థినీ విద్యార్థులతో కలిసి, ఆంధ్రప్రదేశ్ డిజిపి గౌతమ్ సవాంగ్,ఐపిఎస్., గారు, అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవము సందర్భంగా నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్సుకు హాజరైనారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి గౌరవ శ్రీ గౌతమ్ సావాంగ్, ఐపియస్., గారు జూమ్ వీడియో యాప్ ద్వారా అన్ని జిల్లాల / యూనిట్ల యొక్క పోలీసు అధికారులతో, కాలేజి విద్యార్థినీ విద్యార్థుల తో, సదరు కాలేజీల యొక్క ప్రిన్సిపాల్స్ / అధ్యాపకులతో వీడియో కాన్ఫరెన్స్ ను డిజిపి కార్యాలయం నుండి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత పోలీసు అధికారులు పి వి సునీల్ కుమార్, ఐపిఎస్., రవిశంకర్ అయ్యన్నర్, ఐపిఎస్., సిహెచ్ ద్వారకా తిరుమలరావు, ఐపిఎస్., తదితర ఉన్నత అధికారులు పాల్గొని, ప్రపంచ మానవాళికి ప్రమాదకరగా మారిన మాదక ద్రవ్యాల వినియోగం గురించి ప్రజలలో అవగాహన కలిగించేందులకు గాను, ప్రతి సంవత్సరం యువత మాదకద్రవ్యాల వినియోగం వైపు వెళ్లకుండా ఉండేందుకు గాను, అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను గురించి /వినియోగం గురించి యువతకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు, ఇటువంటి అవగాహన సదస్సుల ద్వారా ఉన్నత చదువులు, చదువుకునే విద్యార్థుల నుండి స్కూల్ దశలో ఉన్న విద్యార్థులు వరకు మాదక ద్రవ్యాల వినియోగం వలన యువత యొక్క ఆరోగ్యానికి కలిగే నష్టాలను గురించి తెలియజేస్తూ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు, ఈ మాదక ద్రవ్యాలకు విద్యార్థులు ఆకర్షితులు కాకుండా కాలేజీ స్కూల్ యాజమాన్యాలు మరియు విద్యార్థిని విద్యార్థులు యొక్క తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు విద్యార్థినీ విద్యార్థులు యొక్క ప్రవర్తనను గమనిస్తూ ఉండి, మాదక ద్రవ్యాల వినియోగించ కుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలియ జేసినారు. ఈ సందర్భంగా గుంటూరు నుండి ఒక విద్యార్థిని స్కూలు దశలోనే అవగాహన కల్పించే లఘుచిత్రాలు ప్రదర్శిస్తే విద్యార్థిని విద్యార్థులు వాటిలోని మంచిని గ్రహించి చెడు వైపు వెళ్ళకుండా ఉండటానికి అవకాశం ఉంటుందని మరియు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇష్టమైన కోర్సులు చదువుకునే స్వేచ్ఛను ఇస్తే వారి మీద ఒత్తిడి లేకుండా ఉంటుందని, ఆ విధంగా కాకుండా తల్లిదండ్రులు బలవంతంగా పిల్లల అభిప్రాయాలకు విరుద్ధంగా ఉంటే , వారు వత్తిడికి గురై, రిలీఫ్ గా ఉంటుందని తోటి వారిలో ఉన్న చెడు నడత కలిగిన పిల్లలతో కలసి, మత్తు పదార్థాలకు అలవాటు పడే ప్రమాదం ఉంటుందని తెలిపారు. ఆమేరకు పి వి సునీల్ కుమార్ గారు, ప్రతి నెల ప్రతి కాలేజీలలో, స్కూల్స్ లో మహిళా సమస్యల పట్ల, డ్రగ్స్ వినియోగ పట్ల అవగాహన సదస్సులు నిర్వహిస్తామని విద్యార్థిని విద్యార్థులు మంచి స్ఫూర్తి భావం కలిగిలా చర్యలు తీసుకొంటామని, విద్యార్థినీ విద్యార్థులు వారి యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మాదక ద్రవ్యాల వినియోగం చేయకుండా మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, మీపైన మీ యొక్క తల్లిదండ్రులు పెట్టుకున్నటువంటి ఆశలను వమ్ము చేయరాదని డిజిపి గారు తెలియ జేసినారు.


Comments